చింతపల్లి గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ సస్పెన్షన్
ABN , Publish Date - Jul 04 , 2026 | 10:56 PM
చింతపల్లి గిరిజన సంక్షేమ శాఖ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ రామేశ్వరాన్ని సస్పెండ్ చేస్తూ గురుకుల కార్యదర్శి ఎం.గౌతమి ఉత్తర్వులు జారీచేశారు.
చింతపల్లి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): చింతపల్లి గిరిజన సంక్షేమ శాఖ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ రామేశ్వరాన్ని సస్పెండ్ చేస్తూ గురుకుల కార్యదర్శి ఎం.గౌతమి ఉత్తర్వులు జారీచేశారు. శుక్రవారం కళాశాలకు చెందిన ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి సీందెరి అనిల్ ఆత్మహత్య చేసుకున్న విషయం పాఠకులకు తెలిసిందే. విద్యార్థి మృతిపై ఏటీడబ్ల్యూవో, డీఐవో విచారణ చేస్తున్నారు. అయితే విద్యార్థి మృతిని సీరియస్‌గా తీసుకున్న గురుకులం ఉన్నతాధికారులు ప్రిన్సిపాల్‌ని సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.