Share News

చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా బదిలీ

ABN , Publish Date - Jul 06 , 2026 | 10:55 PM

స్థానిక అదనపు ఎస్పీ నవజ్యోతి మిశ్రాను మార్కాపురం జిల్లా ఓఎస్‌డీ(అడ్మిన్‌)గా బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా బదిలీ
నవజ్యోతి మిశ్రా

మార్కాపురం ఓఎస్‌డీగా నియామకం

చింతపల్లి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక అదనపు ఎస్పీ నవజ్యోతి మిశ్రాను మార్కాపురం జిల్లా ఓఎస్‌డీ(అడ్మిన్‌)గా బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 బ్యాంచ్‌కి చెందిన నవజ్యోతి మిశ్రా ఐపీఎస్‌ శిక్షణ పూర్తి చేసుకుని రెండేళ్ల క్రితం చింతపల్లి ఏఎస్పీగా నియమితులయ్యారు. రెండు నెలల క్రితం అదనపు ఎస్పీగా పదోన్నతి పొందారు. చింతపల్లి ఏఎస్పీగా రెండేళ్లు పూర్తికావడంతో మార్కాపురం జిల్లా ఎఎస్‌డీ(అడ్మిన్‌)గా ప్రభుత్వం బదిలీ చేసింది. నవజ్యోతి మిశ్రా గిరిజన ప్రాంతంలో గంజాయి సాగు, రవాణా నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గిరిజన యువతకు పోలీసుశాఖ ద్వారా ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు. గిరిజనులతో మమేకమై ఆయన విధులు నిర్వహించి ఈ ప్రాంతీయుల మన్ననలు పొందారు. కాగా చింతపల్లి ఏఎస్పీగా ఎవరిని నియమించలేదు.

Updated Date - Jul 06 , 2026 | 10:55 PM