Share News

అంబులెన్స్‌లో ప్రసవం

ABN , Publish Date - Nov 22 , 2026 | 11:47 PM

మండలంలోని కొత్తూరు సమీపంలో 108 వాహనంలోనే గిరిజన మహిళ ప్రసవించింది. లుంగపర్తి పంచాయతీ కుంభర్తీ గ్రామానికి చెందిన బోయిన రంభ

అంబులెన్స్‌లో ప్రసవం
108 వాహనంలో ప్రసవించిన గిరిజన మహిళతో ఈఎంటీ శంకర్‌

తల్లీబిడ్డ క్షేమం

అనంతగిరి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తూరు సమీపంలో 108 వాహనంలోనే గిరిజన మహిళ ప్రసవించింది. లుంగపర్తి పంచాయతీ కుంభర్తీ గ్రామానికి చెందిన బోయిన రంభ నిండు గర్భిణి కావడంతో పురిటినొప్పులు అధికమయ్యాయి. కుటుంబ సభ్యులు లుంగపర్తి పీహెచ్‌సీకి ఆదివారం తీసుకువచ్చారు. అక్కడ నుంచి ఆమెకు మెరుగైన వైద్యసేవల నిమిత్తం ఎస్‌కోట ఏరియా ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. సాయంత్రం 108 వాహనంలో గర్భిణిని తరలిస్తుండగా కొత్తూరు సమీపానికి వచ్చేసరికి ఆమెకు పురిటినొప్పులు అధికమయ్యాయి. దీంతో ఈఎంటీ శంకర్‌ ఆమెకు సుఖప్రసవం చేశారు. అనంతరం ఎస్‌కోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని ఈఎంటీ శంకర్‌, పైలట్‌ శ్యామ్‌ సుందరరావు తెలిపారు.

Updated Date - Nov 22 , 2026 | 11:47 PM