మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన ఒడిశా హైకోర్టు చీఫ్ జస్టిస్
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:14 PM
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని శనివారం ఒడిశా హైకోర్టు చీఫ్ జస్టిస్ హరీష్‌టాండన్ బృందం సందర్శించింది.
ముంచంగిపుట్టు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని శనివారం ఒడిశా హైకోర్టు చీఫ్ జస్టిస్ హరీష్‌టాండన్ బృందం సందర్శించింది. ప్రాజెక్టు వించ్‌హౌస్ వద్దకు చేరుకున్న చీఫ్ జస్టిస్ బృందానికి ప్రాజెక్టు ఎస్‌ఈ ఏవీ సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు స్వాగతం పలికారు. వించ్ మార్గంలో విద్యుత్ కేంద్రానికి చేరుకొని విద్యుదుత్పత్తి, ఇరు రాష్ట్రాలకు పంపిణీ విధానం తెలుసుకున్నారు. అనంతరం విద్యుత్ కేంద్రం కంట్రోల్ రూంలో అతిథుల పుస్తకంలో మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం సందర్శనపై తనకు కలిగిన అనుభూతిని హైకోర్టు చీఫ్ జస్టిస్ హరీష్‌టాండన్ రాశారు. ఏడు దశాబ్దాలుగా ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు విద్యుత్ కేంద్రాన్ని చక్కగా నిర్వహిస్తున్నారని అభినందించారు. ఆయన వెంట హైకోర్టు జడ్జ్జి చిత్తరంజన్‌దాస్, హైకోర్టు రిజిస్టర్ డాక్టర్ భాగ్యలక్ష్మి రథ్, తదితరులు ఉన్నారు.