Share News

కెమికల్‌ కాలుష్యం

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:46 AM

ప్రత్యేక ఆర్థిక మండలిలోని ఒక ఫార్మా కంపెనీ నుంచి వెంకటాపురం, నారాయణపురం మీదుగా ఎలమంచిలి వైపు భారీ డంపర్‌ లారీల ద్వారా రవాణా చేస్తున్న మెటీరియల్‌ నుంచి రసాయనంతో కూడిన ద్రవం రోడ్డుపై కారిపోతున్నది. కొద్దిసేపటికే ఇది గట్టిపడి తెల్లగా మారుతున్నది. ఈ రోడ్డుపై వాహనాలు వెళుతున్నప్పుడు తెల్లటి దుమ్ము ఎగిసిపడుతున్నది.

కెమికల్‌ కాలుష్యం
రాంబిల్లి మండలం కొత్తూరు వద్ద టిప్పర్‌ లారీ నుంచి కారుతున్న రసాయన ద్రవం

టిప్పర్ల నుంచి కారిపోతున్న రసాయన ద్రవం

కొద్దిసేపటికి ఎండిపోయి తెల్లటి పొడిగా మారుతున్న వైనం

వాహనాల రాకపోకలతో ఎగిసిపడుతున్న దుమ్ము

కళ్ల మంటలతో ద్విచక్రవాహనదారుల అవస్థలు

రాంబిల్లి/ ఎలమంచిలి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఆర్థిక మండలిలోని ఒక ఫార్మా కంపెనీ నుంచి వెంకటాపురం, నారాయణపురం మీదుగా ఎలమంచిలి వైపు భారీ డంపర్‌ లారీల ద్వారా రవాణా చేస్తున్న మెటీరియల్‌ నుంచి రసాయనంతో కూడిన ద్రవం రోడ్డుపై కారిపోతున్నది. కొద్దిసేపటికే ఇది గట్టిపడి తెల్లగా మారుతున్నది. ఈ రోడ్డుపై వాహనాలు వెళుతున్నప్పుడు తెల్లటి దుమ్ము ఎగిసిపడుతున్నది. దీంతో వాహనదారులు, రహదారికి ఇరువైపులా ఇళ్లల్లో నివసిస్తున్న వారు, దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెజ్‌లో ఏ కంపెనీ నుంచి ఈ లారీలు వస్తున్నాయో తెలియడంలేదని స్థానికులు వాపోతున్నారు. సుమారు రెండు వారాల నుంచి ఇదే పరిస్థితి నెలకొందని, లారీల నుంచి కారుతున్న రసాయన ద్రవం రోడ్డుపై పడి, ఎండకు ఎండిపోయి సున్నం పొడిలా తయారవుతున్నది. వాహనాలు వెళుతున్నప్పుడు, ఎక్కువ గాలి వీచినప్పుడు ఇది ఎగిసిపడుతున్నది. తెల్లటి పొడి కళ్లలోపడి మండుతున్నట్టుగా వుంటున్నదని ద్విచక్ర వాహనదారులు వాపోతున్నారు. ఈ సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రోడ్డు పక్కన వున్న పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Updated Date - Oct 14 , 2026 | 12:46 AM