Share News

జూలై 8 తరువాత ఏ విమానాశ్రయానికి వెళ్లాలో చెక్‌ చేసుకోండి

ABN , Publish Date - May 24 , 2026 | 12:44 AM

విశాఖపట్నం నుంచి జూలై ఎనిమిదో తేదీ తరువాత ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి విమాన టికెట్లు తీసుకునే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ ఎం.శ్రీభరత్‌ సూచించారు.

జూలై 8 తరువాత ఏ విమానాశ్రయానికి వెళ్లాలో చెక్‌ చేసుకోండి

ప్రయాణికులకు ఎంపీ ఎం.శ్రీభరత్‌ సూచన

విశాఖపట్నం, మే 23 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం నుంచి జూలై ఎనిమిదో తేదీ తరువాత ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి విమాన టికెట్లు తీసుకునే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ ఎం.శ్రీభరత్‌ సూచించారు. ఆయన భోగాపురం విమానాశ్రయం ఆపరేషన్‌పై శనివారం స్పందించారు. స్కూట్‌ ఎయిర్‌లైన్స్‌ జూలై 8 నుంచి తన విమానాన్ని భోగాపురం నుంచి నడపడం ఆహ్వానించదగిన పరిణామమన్నారు. ఈ నేపథ్యంలో ఆ తేదీ నుంచి విశాఖ నుంచి విమానంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే ముందుగా ఎంక్వయిరీ చేసుకోవాలన్నారు. ఆయా విమానాలు విశాఖ నుంచి బయలుదేరతాయా?, భోగాపురం నుంచి బయలుదేరతాయా? అనేది నిర్ధారించుకోవాలన్నారు. లేదంటే విమానాశ్రయానికి వెళ్లి ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. స్కూట్‌ ఎయిర్‌లైన్స్‌లాగే మిగిలిన విమాన సంస్థలు తమ ప్రయాణికులకు లొకేషన్‌ మార్పుపై సమాచారం అందించాలన్నారు. ఇదిలావుంటే భోగాపురం విమానాశ్రయం ఎప్పుడు ప్రారంభమవుతుంది? అనే విషయం ఎంపీ శ్రీభరత్‌ వెల్లడించలేదు. దీనిని బట్టి ఇంకా తేదీ ఖరారు కాలేదని తెలుస్తోంది.

Updated Date - May 24 , 2026 | 12:44 AM