రేషన్ డీలర్ల ఆగడాలకు చెక్
ABN , Publish Date - Feb 05 , 2026 | 01:22 AM
నిర్దేశిత సమయం కంటే ముందుగా కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్న 61 మంది రేషన్ డీలర్లకు జిల్లా పౌర సరఫరాల శాఖ నోటీసులు జారీచేసింది. కొందరు డీలర్లు ఒకటో తేదీ కంటే ముందే కార్డుదారుల ఇళ్లకు వెళ్లి సరుకులు పంపిణీ చేస్తున్నారని ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించడంతో జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి స్పందించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి వి.భాస్కర్‌ను ఆదేశించారు.
నిర్దేశిత సమయం కంటే ముందే
బియ్యం పంపిణీ చేసిన
61 మందికి నోటీసులు
విశాఖపట్నం, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి):
నిర్దేశిత సమయం కంటే ముందుగా కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్న 61 మంది రేషన్ డీలర్లకు జిల్లా పౌర సరఫరాల శాఖ నోటీసులు జారీచేసింది. కొందరు డీలర్లు ఒకటో తేదీ కంటే ముందే కార్డుదారుల ఇళ్లకు వెళ్లి సరుకులు పంపిణీ చేస్తున్నారని ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించడంతో జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి స్పందించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి వి.భాస్కర్‌ను ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలోని 642 మంది రేషన్ డీలర్లలో 61 మంది ఫిబ్రవరి నెల సరుకులను గత నెల 31 కంటే ముందుగా పంపిణీ చేసినట్టు గుర్తించారు. వారందరికీ నోటీసులు జారీచేసి, వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు డీఎస్‌వో తెలిపారు. ఇకపై గడువుకు ముందు సరుకులు పంపిణీ చేయవద్దని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించామన్నారు.