Share News

రహదారి కష్టాలకు చెక్‌

ABN , Publish Date - Mar 15 , 2026 | 11:58 PM

గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి క్రమంగా మారుతున్నది. రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో, ఇప్పటి వరకు గోతుల మయంగా ఉన్న రోడ్లు క్రమంగా కొత్తరూపు సంతరించుకుంటున్నాయి.

రహదారి కష్టాలకు చెక్‌
గవరవరం- చోడవరం రోడ్డు పనులు చురుగ్గా సాగుతున్న దృశ్యం

శరవేగంగా చోడవరం- గవరవరం రోడ్డు పనులు

చోడవరం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి క్రమంగా మారుతున్నది. రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో, ఇప్పటి వరకు గోతుల మయంగా ఉన్న రోడ్లు క్రమంగా కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. వేసవి ముగిసేలోగా రహదారుల అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలో పనులు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే మండలంలోని గవరవరం- చోడవరం రోడ్డు అభివృద్ధి పనులు రెండున్నర కోట్ల రూపాయలతో చేపట్టారు. గత నెల చివరి వారంలో పనులు ప్రారంభంకాగా, గవరవరం నుంచి చోడవరం వరకు తారురోడ్డు వేసే పనిని ఆదివారం ప్రారంభించారు. మరో వారంలోగా పనులు పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా నిర్వహణ కొరవడి గోతులమయమైన గవరవరం రోడ్డులో నానా అవస్థలు పడుతున్న రెండు నియోజకవర్గాల ప్రజలు ఇప్పుడు రోడ్డు పనులు శరవేగంగా సాగుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 15 , 2026 | 11:58 PM