Share News

ఎనిమిది మంది ఉపాధ్యాయులకు చార్జి మెమోలు

ABN , Publish Date - Jan 09 , 2026 | 01:03 AM

గొలుగొండ, నర్సీపట్నం మండలాల్లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఎనిమిది మంది ఉపాధ్యాయులకు, ఒక ఎంఆర్‌పీకి జిల్లా విద్యా శాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు చార్జిమెమోలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇన్‌చార్జి ఎంఈవో ఓ.సత్యనారాయణ గురువారం వెల్లడించారు.

ఎనిమిది మంది ఉపాధ్యాయులకు చార్జి మెమోలు
ఈ నెల ఆరో తేదీన గొలుగొండ ఎంఈఓ కార్యాలయానికి వచ్చిన ఉపాధ్యాయులు

ఎంఆర్‌పీకి కూడా..

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు జారీ చేసినట్టు డీఈవో ప్రకటన

గొలుగొండ, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): గొలుగొండ, నర్సీపట్నం మండలాల్లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఎనిమిది మంది ఉపాధ్యాయులకు, ఒక ఎంఆర్‌పీకి జిల్లా విద్యా శాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు చార్జిమెమోలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇన్‌చార్జి ఎంఈవో ఓ.సత్యనారాయణ గురువారం వెల్లడించారు. ఆయా ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న జి.దాసు, కె.బాలకృష్ణ (గొలుగొండ), శ్రీపాద లక్ష్మీనరసింహం (చోద్యం), జి.శ్రీరామ్మూర్తి (పోలవరం), నల్లబెల్లి చిట్టితల్లి (కొత్తఎల్లవరం), ఏ.రమణమూర్తి (లింగంపేట), నర్సీపట్నం మండలంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కురుసా వెంకటరమణ, డి.గోపీనాథ్‌ ఈ నెల 6వ తేదీన పాఠశాలలు నడిచే సమయంలో గొలుగొండ మండల విద్యా శాఖ అధికారి కార్యాలయానికి వచ్చారు. వీరు ఎంఆర్‌పీ నూకరాజుతో వాదనకు దిగారు. దీంతో ఎనిమిది మంది ఉపాధ్యాయులు, ఒక ఎంఆర్‌పీకి డీఈవో మెమోలు జారీ చేశారు. వీటిపై వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - Jan 09 , 2026 | 01:03 AM