Share News

అడివిదున్న హల్‌చల్‌

ABN , Publish Date - Nov 03 , 2026 | 12:50 AM

చింతాలమ్మఘాట్‌ రోడ్డులో సోమవారం మధ్యాహ్నం అడవిదున్న హల్‌చల్‌ చేసింది.

అడివిదున్న హల్‌చల్‌
చింతాలమ్మఘాట్‌లో అడవిదున్న

చింతాలమ్మఘాట్‌లో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం

కొయ్యూరు, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): చింతాలమ్మఘాట్‌ రోడ్డులో సోమవారం మధ్యాహ్నం అడవిదున్న హల్‌చల్‌ చేసింది. కృష్ణాదేవిపేట నుంచి కొయ్యూరు, రాజమహేంద్రవరం, తదితర ప్రాంతాలకు వెళ్లే జాతీయ రహదారి 516-ఈ మధ్యలో గల చింతాలమ్మఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన రెండవ మలుపు వద్ద అడవిదున్న తిరుగాడింది. ఆ సమయంలో అటుగా వచ్చే వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేసింది. నర్సీపట్నం నుంచి రాజమహేంద్రవరం వెళ్లే బస్సు కొద్దిసేపు నిలిచిపోయింది. ప్రయాణికులు బిగ్గరగా కేకలు వేయడంతో అడవిదున్న భయాందోళనకు గురై కిత్తలోవ వైపు కొండ ఎక్కింది. దీంతో రాకపోకలు సజావుగా సాగాయి.

Updated Date - Nov 03 , 2026 | 12:50 AM