మారిన పాలన.. బాగుపడిన రోడ్లు
ABN , Publish Date - Apr 22 , 2026 | 12:38 AM
వైసీపీ ఐదేళ్ల పాలనలో దయనీయంగా ఉన్న గ్రామీణ రహదారుల పరిస్థితి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మెరుగుపడుతున్నది. ఐదేళ్ల వైసీపీ హయాంలో గోతులమయంగా మారిన అధ్వాన రహదారులతో ఇబ్బందులు పడిన ప్రజలు.. ఇప్పుడు చక్కగా రూపుదిద్దుకోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు.
చోడవరం- గవరవరం మధ్య పూర్తయిన తారు రోడ్డు నిర్మాణం
తొమ్మిది కిలోమీటర్లు.. రూ.2.5 కోట్ల వ్యయం
వాహనదారులకు తీరిన కష్టాలు
చోడవరం, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఐదేళ్ల పాలనలో దయనీయంగా ఉన్న గ్రామీణ రహదారుల పరిస్థితి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మెరుగుపడుతున్నది. ఐదేళ్ల వైసీపీ హయాంలో గోతులమయంగా మారిన అధ్వాన రహదారులతో ఇబ్బందులు పడిన ప్రజలు.. ఇప్పుడు చక్కగా రూపుదిద్దుకోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు. చోడవరం- దేవరాపల్లి మార్గంలో స్థానిక కొత్తూరు జంక్షన్ నుంచి గవరవరం వరకు రహదారి అభివృద్ధి పనులను రెండున్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టారు. సుమారు తొమ్మిది కిలోమీటర్ల పొడవు వున్న ఈ రహదారి పనులను నెల రోజుల్లో పూర్తి చేశారు. పట్టణ పరిధిలో కొత్తూరు జంక్ష న్, అన్నవరం వద్ద నిన్నమొన్నటి వరకు అధ్వాన్నంగా ఉన్న రోడ్డును.. బీటీతో అభివృద్ధి చేయడంతో వాహనదారుల ఊరట చెందుతున్నారు. తారు రోడ్డుపై కుదుపులు లేకుండా సాఫీగా ప్రయాణిస్తున్నారు.