ఘనంగా చంద్రబాబు జన్మదినం
ABN , Publish Date - Apr 21 , 2026 | 01:09 AM
ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు 76వ జన్మదిన వేడుకలను సోమవారం నాయకులు, కార్యకర్తలు నగరంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు 76వ జన్మదిన వేడుకలను సోమవారం నాయకులు, కార్యకర్తలు నగరంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యాలయంలో లోపల కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎం.శ్రీభరత్, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు చోడె వెంకట పట్టాభిరామ్, కార్యదర్శి లొడగల కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, నాయకులు కోరాడ రాజబాబు, పుచ్చా విజయకుమార్, బైరెడ్డి పోతనరెడ్డి, సుజాత, ఉరుకూటి నారాయణ, విల్లూరి భాస్కరరావు, వానపల్లి గాయిత్రి ఫణికుమారి, తదితరులు పాల్గొన్నారు.
-మహారాణిపేట/ఆంధ్రజ్యోతి