చంద్రబాబు జోలికొస్తే సహించేది లేదు
ABN , Publish Date - Feb 02 , 2026 | 01:04 AM
తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు స్పష్టం చేశారు. చంద్రబాబును, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ పరంగా ఎవరైనా విమర్శించవచ్చని, కానీ వ్యక్తిగత దూషణలు, అసభ్యపదజాలం ఉపయోగించడం సరికాదన్నారు.
అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పాలిందే
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు డిమాండ్
మాజీ ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో అంబటి దిష్టిబొమ్మ దహనం
నర్సీపట్నం, నక్కపల్లి పీఎస్‌లలో ఫిర్యాదులు
అనకాపల్లి, పిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు స్పష్టం చేశారు. చంద్రబాబును, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ పరంగా ఎవరైనా విమర్శించవచ్చని, కానీ వ్యక్తిగత దూషణలు, అసభ్యపదజాలం ఉపయోగించడం సరికాదన్నారు. వైసీపీ నాయకులు రాజకీయంగా టీడీపీని ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలు, దూషణలకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబునాయుడు రాష్ట్రం అభివృద్ధి కోసం అహరహం శ్రమిస్తుంటే.. వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. భవిష్యత్‌లో రాంబాబే కాకుండా వైసీపీ నాయకులు ఎవరైనా టీడీపీ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయడు, సీనియర్ నాయకులు సత్యనారాయణ, కాయల మురళి, బాబీ, చెక్కల శ్రీను, శ్రీనివాస్ పాల్గొన్నారు.
అంబటి దిష్టిబొమ్మ దహనం
అనకాపల్లి టౌన్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ద నాగజగదీశ్వరరావు ఆధ్వర్యంలో ఇక్కడ మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను టీడీపీ శ్రేణులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ హయాంలో తిరుమల వేంకటేశ్వరసామి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసినట్టు సీబీఐ నియమించిన సిట్ నిర్ధారించిందని, దీంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టించడానికి వైసీపీ నేత రాంబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబును, మంత్రి లోకేశ్‌ను ఉద్దేశించి సభ్య సమాజం సిగ్గుపడేలా బూతులు మాట్లాడారని ఆరోపించారు.
1ఎన్‌పీ2: నర్సీపట్నం సీఐ గఫూర్‌కి ఫిర్యాదు చేస్తున్న టీడీపీ శ్రేణులు
ఫొటోః1ఎన్‌కేపీ4:నక్కపల్లి సీఐకు ఫిర్యాదు చేస్తున్న బోదిగల్లం సర్పంచ్ మున్నీసాబేగం, టీడీపీ నాయకులు
అంబటి రాంబాబుపై ఫిర్యాదులు
నర్సీపట్నం, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు ఆదివారం పట్టణ సీఐ గఫూర్‌కి ఫిర్యాదు చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ కార్యదర్శి లాలం మురళీకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కష్టపడుతున్న సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు సరికాదని అన్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమిని తట్టుకోలేక వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రమణ, మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
నక్కపల్లిలో...
నక్కపల్లి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని తీవ్ర పదజాలంతో దూషించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బోదిగల్లం సర్పంచ్, తెలుగు మహిళ మండల అధ్యక్షురాలు షేక్ ఫాతిమా మున్నీసా బేగం, పలువురు టీడీపీ నాయకులు ఆదివారం సీఐ జె.మురళీకి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గం కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేశ్, పీఏసీఎస్ పర్సన్ ఇన్‌ఛార్జిలు కొప్పిశెట్టి బుజ్జి, వెలగా శ్రీను, దార్ల కృష్ణ, టీడీపీ మండల అధ్యక్షుడు గింజాల లక్ష్మణరావు, జిల్లా అధికార ప్రతినిధి నానేపల్లి రాఘవులు, వేంపాడు ఉప సర్పంచ్ అయినంపూడి అప్పలరాజు, బీజేపీ నాయకుడు కోసూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.