Share News

జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌గా చక్రవర్తి

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:51 PM

మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అనకాపల్లి జోనల్‌ కమిషనర్‌గా కె.చక్రవర్తిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌గా చక్రవర్తి
చక్రవర్తి

మాతృ శాఖ నుంచి మరోసారి డిప్యూటేషన్‌పై రాక

అనకాపల్లి టౌన్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అనకాపల్లి జోనల్‌ కమిషనర్‌గా కె.చక్రవర్తిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జోనల్‌ కమిషనర్‌గా పనిచేసిన ఆయన... మాతృ శాఖ వ్యవసాయ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి రావడంతో రెండు నెలల క్రితం అమరావతిలో వ్యవసాయ శాఖకు వెళ్లారు. మళ్లీ ఇప్పుడు డిప్యూటేషన్‌పై అనకాపల్లి జోనల్‌ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. గురువారం బాధ్యతలు చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఇన్‌చార్జి జోనల్‌ కమిషనర్‌గా హెల్త్‌ ఆఫీసర్‌ డి.లక్ష్మీతులసీ వ్యవహరిస్తున్నారు.

Updated Date - Jul 14 , 2026 | 11:51 PM