చకచకా రణజిల్లెడ జంక్షన్-దుమ్మగుడ రోడ్డు
ABN , Publish Date - Jul 10 , 2026 | 10:41 PM
మండలంలోని పద్మాపురం మేజర్ పంచాయతీ రణజిల్లెడ జంక్షన్ నుంచి దుమ్మగుడ గ్రామం వరకు తారురోడ్డు పనులు చకచకా సాగుతున్నాయి.
రూ.1.4 కోట్లతో తారు రోడ్డు నిర్మాణం
మెటల్ వేసి రోలింగ్ పనులు పూర్తి
అరకులోయ, జూలై 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పద్మాపురం మేజర్ పంచాయతీ రణజిల్లెడ జంక్షన్ నుంచి దుమ్మగుడ గ్రామం వరకు తారురోడ్డు పనులు చకచకా సాగుతున్నాయి. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో ఈ రహదారికి రూ.కోటి 40 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో 1.4 కిలోమీటర్ల తారురోడ్డును నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు పనులు గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణలో జరుగుతున్నాయి. రహదారిపై వేసిన మెటల్‌ను రోలింగ్ చేశారు. జీఎస్‌పీ వేసి మరోసారి రోలింగ్ చేసి తారు వేయాల్సి ఉంది. పక్కా రహదారి సౌకర్యం లేని దుమ్మగుడకు తారురోడ్డు నిర్మిస్తుండడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.