నలుగురు జడ్పీటీసీలకు ధ్రువీకరణ పత్రాలు అందజేత
ABN , Publish Date - Nov 09 , 2026 | 11:31 PM
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు జడ్పీటీసీ సభ్యులకు జడ్పీ రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ సోమవారం ధ్రువీకరణ పత్రాలను అందించారు.
కౌంటింగ్ రోజున ముగ్గురికి పంపిణీ, మరో నలుగురికి అందజేయాల్సి ఉంది
పాడేరు, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు జడ్పీటీసీ సభ్యులకు జడ్పీ రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ సోమవారం ధ్రువీకరణ పత్రాలను అందించారు. జి.మాడుగుల జడ్పీటీసీ సభ్యురాలుగా విజయం సాధించిన సోమెలి అఖిల(టీడీపీ), హుకుంపేట జడ్పీటీసీ సభ్యురాలు ఒంటూబు ప్రియాంక(వైసీపీ), ముంచంగిపుట్టు జడ్పీటీసీ సభ్యురాలు కొర్రా త్రినాథ్(సీపీఎం), డుంబ్రిగుడ జడ్పీటీసీ సభ్యుడు కిముడు హరి(వైసీపీ)లకు ధ్రువీకరణ పత్రాలను అందించారు. అలాగే కౌంటింగ్ జరిగిన రోజు శనివారం అర్థరాత్రి పాడేరు జడ్పీటీసీ సభ్యుడు సీదరి రాంబాబు(వైసీపీ), అనంతగిరి జడ్పీటీసీ సభ్యురాలు డూరు జయవర్థిని(వైసీపీ), పెదబయలు జడ్పీటీసీ సభ్యురాలు వంతాల శాంతి(వైసీపీ) ఎన్నిక ధ్రువీకరణ పత్రాలు పొందారు. మిగిలిన ప్రాంతాల్లో కౌంటింగ్ ఆలస్యం కావడంతో ఎన్నికల ధ్రువీకరణ పత్రాలను పొందలేకపోయారు. ఈ క్రమంలో సోమవారం నలుగురు జడ్పీటీసీ సభ్యులు ధ్రువీకరణ పత్రాలు పొందగా, ఇంకా చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, పెదబయలు జడ్పీటీసీ సభ్యులు ఎన్నిక ధ్రువీకరణ పత్రాలు పొందాల్సి ఉంది.