జీసీసీకి కేంద్రం 2025- స్కాచ్ అవార్డు
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:36 PM
కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో గిరిజన సహకార సంస్థకు ‘2025- స్కాచ్ అవార్డు’ దక్కింది.
అభినందించిన సీఎం చంద్రబాబునాయుడు
పాడేరు, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో గిరిజన సహకార సంస్థకు ‘2025- స్కాచ్ అవార్డు’ దక్కింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, తదితరులు ఈమేరకు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిసి స్కాచ్ అవార్డును చూపించారు. గిరిజన సంక్షేమానికి కృషి చేసినందుకు జీసీసీకి స్కాచ్ అవార్డు దక్కడం గొప్ప విషయమని పేర్కొన్న సీఎం, అందుకు కృషి చేసిన మంత్రి సంధ్యారాణి, మేనేజింగ్ డైరెక్టర్ శోభిక, చైర్మన్ శ్రావణ్‌కుమార్, సిబ్బందిని అభినందించారు.