జూ అభివృద్ధికి కేంద్ర నిధులు
ABN , Publish Date - Jan 30 , 2026 | 01:15 AM
జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం కె.పవన్ కల్యాణ్ గురువారం నగరంలోని జంతుప్రదర్శనశాల, కంబాలకొండలను సందర్శించారు.
ప్రతిపాదనలు పంపండి
అధికారులకు డిప్యూటీ సీఎం కె.పవన్‌కల్యాణ్ ఆదేశాలు
జంతుప్రదర్శనశాల సందర్శన....ఆహారం, పరిరక్షణపై ఆరా
నేడు అరకు ఉత్సవ్‌కు...?
కాలుష్యంపై నగరంలో అధికారులతో సమావేశం రేపు
విశాఖపట్నం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి):
జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం కె.పవన్ కల్యాణ్ గురువారం నగరంలోని జంతుప్రదర్శనశాల, కంబాలకొండలను సందర్శించారు. జూలో జంతువుల పరిరక్షణ, వాటికి అందిస్తున్న ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు. జూ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రప్పిస్తామని, ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చునో తనకు నివేదికలు పంపాలని జూ అధికారులకు సూచించారు. ఎర్రమట్టి దిబ్బల పరిశీలన కార్యక్రమం రద్దయింది. రాత్రికి హోటల్‌కు చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయం రోడ్డు మార్గాన అరకు బయలుదేరి వెళతారు. అక్కడ ఉత్సవ్‌లో పాల్గొంటారు. శనివారం నగరంలోని కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. విశాఖపట్నంలో పెరుగుతున్న కాలుష్యం, కారణాలు, తీసుకోవలసిన చర్యలపై చర్చిస్తారు.