Share News

మెడికల్‌ కాలేజీలో సంబరాలు

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:43 AM

ఈ నెల 9న స్థానిక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం వార్షిక సంబరాలను ఘనంగా ప్రారంభించారు.

మెడికల్‌ కాలేజీలో సంబరాలు
థింసా నృత్యం చేస్తున్న మెడికల్‌ కాలేజీ విద్యార్థులు

ఘనంగా వార్షికోత్సవ కార్యక్రమాలు ప్రారంభం

థింసా నృత్యాలతో అలరించిన వైద్య విద్యార్థులు

పాడేరు, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 9న స్థానిక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం వార్షిక సంబరాలను ఘనంగా ప్రారంభించారు. దీనిలో భాగంగా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.హేమలతదేవి బ్యాటింగ్‌ చేసి క్రికెట్‌ పోటీలను ప్రారంభించారు. అనంతరం వైద్య కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ రకాల ఆటల పోటీలు, థింసా నృత్యాలతో సందడి చేశారు. రానున్న మూడు రోజులు వివిధ కార్యక్రమాలను చేపట్టి 9న వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని ప్రిన్సిపాల్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పాపారత్నం, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ టి.నరసింగరావు, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 12:43 AM