Share News

జిల్లాకు సియట్‌ టైర్ల కంపెనీ

ABN , Publish Date - Apr 08 , 2026 | 01:00 AM

నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెం మండలంలో మరో భారీ కంపెనీ ఏర్పాటు కానున్నది. ప్రముఖ టైర్ల ఉత్పత్తిదారు అయిన ‘సియట్‌ టైర్స్‌’ రాచపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 737లో 200 ఎకరాలు అవసరమని దరఖాస్తు చేసుకుంది. దీంతో మంగళవారం ఏపీఐఐసీ అధికారులు, సియట్‌ టైర్స్‌ కంపెనీ ప్రతినిధులు ఇక్కడకు వచ్చి భూములను, మ్యాపులను పరిశీలించారు.

జిల్లాకు సియట్‌ టైర్ల కంపెనీ
భూముల మ్యాపును పరిశీలిస్తున్న ఏపీఐఐసీ అధికారులు, సియట్‌ టైర్ల కంపెనీ ప్రతినిధులు

మాకవరపాలెం మండలం రాచపల్లిలో ఏర్పాటు

200 ఎకరాలు అవసరమన్న కంపెనీ ప్రతినిధులు

అధికారులతో కలిసి భూముల పరిశీలన

మాకవరపాలెం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెం మండలంలో మరో భారీ కంపెనీ ఏర్పాటు కానున్నది. ప్రముఖ టైర్ల ఉత్పత్తిదారు అయిన ‘సియట్‌ టైర్స్‌’ రాచపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 737లో 200 ఎకరాలు అవసరమని దరఖాస్తు చేసుకుంది. దీంతో మంగళవారం ఏపీఐఐసీ అధికారులు, సియట్‌ టైర్స్‌ కంపెనీ ప్రతినిధులు ఇక్కడకు వచ్చి భూములను, మ్యాపులను పరిశీలించారు.

రాచపల్లి సర్వే నంబరు 737లో వున్న ఎరకన్నపాలెం, రామన్నపాలెం, వెంకయ్యపాలెం గ్రామాల్లో 406.85 ఎకరాలను రెవెన్యూ శాఖ నుంచి ఇటీవల ఏపీఐఐసీ అధికారులు తీసుకున్నారు. ఇందులో 150 ఎకరాలను డోజ్కో కంపెనీకి, 20 ఎకరాలను ఎంఎస్‌ఎంఈ పార్కుకు కేటాయించారు. ఇంకా సుమారు 240 ఎకరాలు మిగిలి వుంది. ఈ నేపథ్యంలో సియట్‌ టైర్ల కంపెనీ ఏర్పాటుకు 200 ఎకరాలు అవసరమని ఆ కంపెనీ యాజమాన్యం కోరింది. దీంతో మంగళవారం తహశీల్దారు ముజీబ్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజరు నరసింహారావు, మండల సర్వేయరు వెంకటేశ్వరరావు, సియట్‌ టైర్ల కంపెనీ ప్రతినిధులు ఇక్కడకు వచ్చి భూములను పరిశీలించారు. మిగిలిన సుమారు 40 ఎకరాలను ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీకి కేటాయిస్తామని ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ తెలిపారు.

Updated Date - Apr 08 , 2026 | 01:00 AM