ఇంద్రజ్యుమ్న హాలులో సీసీ కెమెరాలు
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:23 AM
రైల్వే గూడ్స్‌షెడ్డుకు సమీపంలోని ఇంద్రజ్యుమ్న హాలులో ఐదుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 13వ తేదీన ‘పవిత్ర ప్రదేశంపై చిన్నచూపు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో స్పందన
ఐదుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించిన ఆలయ పాలకమండలి
అనకాపల్లి టౌన్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): రైల్వే గూడ్స్‌షెడ్డుకు సమీపంలోని ఇంద్రజ్యుమ్న హాలులో ఐదుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 13వ తేదీన ‘పవిత్ర ప్రదేశంపై చిన్నచూపు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. చీకటిపడిన తరువాత ఇంద్రజ్యుమ్న హాలు మందుబాబులు, గంజాయి బ్యాచ్‌లకు అడ్డాగా మారడంతోపాటు ఖాళీ మద్యం సీసాలు పడి వుండడాన్ని కథనంలో కళ్లకుకట్టినట్టు ప్రచురితమైంది. దీంతో జగన్నాథస్వామి ఆలయ ట్రస్ట్‌బోర్డు చైర్మన్ దాడి బుజ్జి స్పందించారు. దేవదాయ శాఖ అధికారులు, ఆలయ ట్రస్ట్‌బోర్డు ప్రతినిధులతో సంప్రదించి, సుమారు రూ.34 వేలతో ఐదు సీసీ కెమెరాలు, వైరు, ఇతర పరికరాలు కొనుగోలు చేశారు. వీటిని ఆదివారం ఇంద్రజ్యుమ్న హాలులో వేర్వేరుచోట్ల ఏర్పాటు చేయించారు. ఇంద్రజ్యుమ్న హాలును పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని చైర్మన్ బుజ్జి తెలిపారు. పట్టణ పోలీసు స్టేషన్ సీఐ జి.ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ, ఇంద్రజ్యుమ్న హాలు ప్రాంతంలో రాత్రిపూట పోలీసు సిబ్బంది గస్తీ తిరుగుతారని, అక్కడ చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.