Share News

గాదిగుమ్మి జలపాతం ఉరకలు

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:42 AM

మండలంలోని చిట్టింపాడు పంచాయతీ లింగాపురం సమీపంలో బాహుబలి కొండలపై నుంచి జాలువారే గాదిగుమ్మి జలపాతం ఉరకలేస్తోంది.

గాదిగుమ్మి జలపాతం ఉరకలు
వరదనీటితో ఉరకలు వేస్తున్న గాదిగుమ్మి జలపాతం

కొయ్యూరు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని చిట్టింపాడు పంచాయతీ లింగాపురం సమీపంలో బాహుబలి కొండలపై నుంచి జాలువారే గాదిగుమ్మి జలపాతం ఉరకలేస్తోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలపాతం పైనుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. జలపాతం పరిసరాలు ప్రకృతి రమణీయత ఉట్టిపడుతున్నది. కొండలను ఆనుకుని శ్వేత మేఘాల పయనం.. పక్షుల కిలకిల రావాలు.. వివిధ రకాల పుష్పాలతో కనువిందు చేస్తున్నది. దీంతో చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Updated Date - Sep 26 , 2026 | 12:42 AM