Share News

పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు

ABN , Publish Date - Apr 16 , 2026 | 01:26 AM

పేదల ఆకలి తీర్చాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేస్తున్నదని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.

పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు
పాడేరులో అన్న క్యాంటీన్‌ ప్రారంభిస్తున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి, పక్కన కలెక్టర్‌ నిశాంతి, తదితరులు

జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి

పాడేరులో ఘనంగా ప్రారంభం

పాడేరు, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): పేదల ఆకలి తీర్చాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేస్తున్నదని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. కలెక్టర్‌ టి.నిశాంతి, జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మలతో కలిసి బుధవారం పాడేరులో అన్న క్యాంటీన్‌ను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో అన్న క్యాంటీన్‌ సేవలు అందుబాటులోకి రావడం ఆనందమన్నారు. పేదలకు ప్రయోజనం కలుగుతుందనే ఆలోచనతోనే రూ.61 లక్షల వ్యయంతో దీనిని ఏర్పాటు చేశామన్నారు. కేవలం రూ.5కే రుచి, నాణ్యత కలిగిన ఆహారాన్ని అందిస్తారని, దీనిని ఈ ప్రాంతీయులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి, కలెక్టర్‌ నిశాంతి, జేసీ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్మవర్మ, జీసీసీ చైర్మన్‌ శ్రావణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తదితరులు పలువురికి భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, టీడీపీ నేతలు చల్లంగి లక్ష్మణరావు, బొర్రా విజయరాణి, బాకూరు వెంకటరమణ, గంగపూజారి శివకుమార్‌, డప్పోడి వెంకటరమణ, బుద్ద జ్యోతికిరణ్‌, బుక్కా జగదీశ్‌, అల్లంగి సుబ్బలక్ష్మి, డిప్పల వెంకటకుమారి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2026 | 01:26 AM