Share News

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని సందర్శించిన కేన్‌ కమిషనర్‌

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:34 AM

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని రాష్ట్ర కేన్‌ కమిషనర్‌ వి.వెంకటరావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ అధికారులు, కార్మికులతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గోవాడ చెరకు రైతుల బకాయిల కోసం రూ.28 కోట్లు విడుదల చేయడంతోపాటు, జిల్లాలోని ఇతర షుగర్‌ ఫ్యాక్టరీల ఆస్తుల లిక్విడేషన్‌, కార్మికుల బకాయిలు, ఇతర అంశాలపై ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఫ్యాక్టరీని సందర్శించినట్టు ఆయన పేర్కొన్నారు.

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని సందర్శించిన కేన్‌ కమిషనర్‌
కేన్‌ కమిషనర్‌ వెంకటరావుకు వినతిపత్రం ఇస్తున్న కార్మిక సంఘం నాయకులు

చోడవరం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని రాష్ట్ర కేన్‌ కమిషనర్‌ వి.వెంకటరావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ అధికారులు, కార్మికులతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గోవాడ చెరకు రైతుల బకాయిల కోసం రూ.28 కోట్లు విడుదల చేయడంతోపాటు, జిల్లాలోని ఇతర షుగర్‌ ఫ్యాక్టరీల ఆస్తుల లిక్విడేషన్‌, కార్మికుల బకాయిలు, ఇతర అంశాలపై ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఫ్యాక్టరీని సందర్శించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు శరగడం రామునాయుడు, రాయి సూరిబాబు, పలువురు కార్మికులు.. కమిషనర్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. పదవీ విరమణ చేసిన 60 మంది కార్మికులకు గ్రాట్యుటీ ఇవ్వలేదని, ఫ్యాక్టరీని మూసివేయడంతో కార్మికుల కుటుంబాలు వీధినపడ్డాయన్నారు. అందువల్ల ఫ్యాక్టరీని తిరిగి తెరిపించి చెరకు రైతులను, కార్మికులను ఆదుకోవాలని, వేతనాల బకాయిల విడుదలకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Oct 10 , 2026 | 12:34 AM