అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించాల్సిందే..
ABN , Publish Date - Nov 25 , 2026 | 12:42 AM
స్థానిక సంస్థల్లో పోటీ చేసిన అభ్యర్థులు విధిగా ఖర్చుల వివరాలు సమర్పించాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు నీరజ్ హన్స్ అన్నారు.
ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లోగా అందజేయకుంటే పదవులను కోల్పోయే ప్రమాదం
ఎన్నికల వ్యయ పరిశీలకుడు నీరజ్ హన్స్
చింతపల్లి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల్లో పోటీ చేసిన అభ్యర్థులు విధిగా ఖర్చుల వివరాలు సమర్పించాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు నీరజ్ హన్స్ అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. బ్యాలెట్ ఓటింగ్ సరళిని పరిశీలించి ప్రత్యేక అధికారి వెంకట రమణారావు, ఎంపీడీవో లాలం సీతయ్యతో మాట్లాడారు. ఈ సందర్భంగా నీరజ్ హన్స్ మాట్లాడుతూ జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో పాటు పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యులు ఎన్నికల ఖర్చుల వివరాలను సకాలంలో అందజేయాలన్నారు. ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లోగా ఖర్చుల వివరాలను అందజేయకపోతే పదవులను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. రిటర్నింగ్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు గెలుపొందిన, ఓటమిపాలైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఖర్చుల వివరాలు అందజేయాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. అలాగే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సైతం ఖర్చుల వివరాలు అందజేయాల్సి వుందని ముందుగానే తెలియజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో లైజనింగ్ అధికారి, జిల్లా పర్యాటకశాఖ అధికారి పట్టాసి చలపతిరావు పాల్గొన్నారు.