Share News

పర్యాటకుల సందడి

ABN , Publish Date - Aug 30 , 2026 | 11:20 PM

ఆంధ్రకశ్మీర్‌ లంబసింగిలో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం ప్రకృతి అందాలను వీక్షించేందుకు అత్యధిక సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు.

పర్యాటకుల సందడి
చెరువులవేనంలో పర్యాటకులు

చింతపల్లి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రకశ్మీర్‌ లంబసింగిలో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం ప్రకృతి అందాలను వీక్షించేందుకు అత్యధిక సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. ఉదయం ఓ వైపు చిరుజల్లులు కురుస్తున్నప్పటికి ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు చెరువులవేనంలో ప్రకృతి సౌందర్యాన్ని వీక్షిస్తూ సందర్శకులు ఎంజాయ్‌ చేశారు. ప్రకృతి అందాలను కెమెరాలో బందించేందుకు పోటీ పడ్డారు. తాజంగి జలాశయంలో సాహస క్రీడలు జిప్‌లైన్‌, బోటింగ్‌ చేసేందుకు సందర్శకులు ఆసక్తి చూపారు. అలాగే యర్రవరం జలపాతాన్ని సైతం పర్యాటకులు సందర్శించారు.

Updated Date - Aug 30 , 2026 | 11:20 PM