Share News

దేవుడి పేరుతో దందా

ABN , Publish Date - Nov 26 , 2026 | 01:22 AM

అది పశు సంవర్ధక శాఖకు చెందిన స్థలం. ఆరిలోవలో రైతుబజార్‌కు ఎదురుగా ఉంది. ఆక్రమించాలని స్థానిక నాయకులు పన్నాగం పన్నారు. చిన్న రాయిని పెట్టి, గుడిసె వేశారు. పూజలు చేశారు. దేవుడు అన్నారు. రెండేళ్ల క్రితమే దీనికి శ్రీకారం చుట్టారు. అప్పుడే ‘ఆంధ్రజ్యోతి’ ఈ విషయం వెలుగులోకి తెచ్చింది. పశు సంవర్ధక శాఖ ఒక బోర్డు పెట్టి చేతులు దులుపుకొంది. ఇప్పుడు ఆ బోర్డు మాయమైంది. గుడిసె చుట్టూ కాంక్రీట్‌ స్తంభాల నిర్మాణం ప్రారంభమైంది. అంటే భవన నిర్మాణానికి పనులు మొదలయ్యాయి.

దేవుడి పేరుతో దందా
పిల్లర్ల నిర్మాణం చేపడుతూ వాటికి గోనెసంచెలు కట్టిన దృశ్యం

ఆరిలోవలో పశు సంవర్ధక శాఖకు

చెందిన స్థలం ఆక్రమణ

ముందు గుడిసె...ఆపై పక్కా నిర్మాణం

చర్యలు శూన్యం

విశాఖపట్నం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి):

అది పశు సంవర్ధక శాఖకు చెందిన స్థలం. ఆరిలోవలో రైతుబజార్‌కు ఎదురుగా ఉంది. ఆక్రమించాలని స్థానిక నాయకులు పన్నాగం పన్నారు. చిన్న రాయిని పెట్టి, గుడిసె వేశారు. పూజలు చేశారు. దేవుడు అన్నారు. రెండేళ్ల క్రితమే దీనికి శ్రీకారం చుట్టారు. అప్పుడే ‘ఆంధ్రజ్యోతి’ ఈ విషయం వెలుగులోకి తెచ్చింది. పశు సంవర్ధక శాఖ ఒక బోర్డు పెట్టి చేతులు దులుపుకొంది. ఇప్పుడు ఆ బోర్డు మాయమైంది. గుడిసె చుట్టూ కాంక్రీట్‌ స్తంభాల నిర్మాణం ప్రారంభమైంది. అంటే భవన నిర్మాణానికి పనులు మొదలయ్యాయి. ఈ పిల్లర్లు కనపడకుంగా ప్లాస్టిక్‌ గోనెసంచెలు కట్టారు. పనిలో పనిగా ఆ భూమి అంతా చదును చేసి అందులో భవన నిర్మాణ సామగ్రి పెట్టి అమ్మకాలు ప్రారంభించారు. ఇప్పుడు వెనుక గెడ్డను కూడా చదును చేస్తున్నారు. ఇదంతా స్థానిక నాయకులు వేయి గజాల భూమి ఆక్రమణకు దశల వారీగా చేస్తున్న కుట్ర. వీరికి పశు సంవర్థక శాఖాధికారులు కూడా సహకరిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. గతంలో ఇలాగే సదరు నాయకులు కబ్జాలు చేశారు. ఆఖరుకు బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు కేటాయించిన భూమి కూడా లాక్కోవాలని చూశారు. ఇప్పుడు ఈ ఖాళీ స్థలంలో వెలిసిన దేవుడికి దీపం కూడా పెట్టడం లేదు. అక్కడి నిర్మాణ మెటీరియల్‌ను తక్షణమే తొలగించాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రజా ప్రతినిధులు కూడా సహకరించాల్సి ఉంది.

Updated Date - Nov 26 , 2026 | 01:22 AM