బస్సులు, జీపులు కిటకిట
ABN , Publish Date - Jan 18 , 2026 | 10:42 PM
సంక్రాంతి పండగకు స్వగ్రామాలకు వచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు, వలస కూలీలు ఆదివారం తిరుగు ప్రయాణం కావడంతో పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రైవేటు జీపుల స్టాండ్‌ల్లో రద్దీ కొనసాగుతోంది.
కొనసాగుతున్న తిరుగు ప్రయాణికుల రద్దీ
అదనపు బస్సులు నడిపిన ఆర్టీసీ డీఎం
పాడేరురూరల్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగకు స్వగ్రామాలకు వచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు, వలస కూలీలు ఆదివారం తిరుగు ప్రయాణం కావడంతో పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రైవేటు జీపుల స్టాండ్‌ల్లో రద్దీ కొనసాగుతోంది. మైదాన ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు, జీపులు కిటకిటలాడాయి. బస్సులు, జీపుల కోసం ప్రయాణికులు గంటల సేపు నిరీక్షించాల్సి వచ్చింది. ప్రయాణికుల రద్దీతో ఆర్టీసీ డీఎం పసగాడ శ్రీనివాసరావు అదనపు బస్సులను నడిపారు.