వెంకన్నపాలెం జంక్షన్‌లో బస్ షెల్టర్ కూల్చివేత
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:41 AM
మండలంలోని వెంకన్నపాలెం జంక్షన్‌లో ప్రధాన రహదారి పక్కన ఉన్న ఆర్‌అండ్‌బీ స్థలంలో ఎప్పటి నుంచో వున్న బస్ షెల్టర్‌ను కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమైన కూడలి కావడంతో ఇక్కడ రోడ్డు పక్కన సెంటు స్థలం రూ.50 లక్షలు పలుకుతున్నది.
రూ.కోటి విలువైన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు
పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు
చోడవరం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వెంకన్నపాలెం జంక్షన్‌లో ప్రధాన రహదారి పక్కన ఉన్న ఆర్‌అండ్‌బీ స్థలంలో ఎప్పటి నుంచో వున్న బస్ షెల్టర్‌ను కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమైన కూడలి కావడంతో ఇక్కడ రోడ్డు పక్కన సెంటు స్థలం రూ.50 లక్షలు పలుకుతున్నది. బస్ షెట్లర్ సుమారు రెండు సెంట్ల స్థలంలో వుంది. దీంతో సుమారు కోటి రూపాయల విలువ చేసే ఈ స్థలంపై స్థానికులు కొందరు కన్నేసి, ఆక్రమించుకోడానికి బస్ షెల్టర్‌ను కూల్చివేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరికి రాజకీయ నేతల అండదండలు వున్నాయని చెబుతున్నారు. ఈ కారణంగానే బస్ షెల్టర్ కూల్చివేసి, స్థలాన్ని చదును చేసి రెండు రోజులైనప్పటికీ ఆర్‌అండ్‌బీ అధికారులు ఇటువైపు కన్నెత్తి అయినా చూడలేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.