మండుతున్న ఎండలు
ABN , Publish Date - Jun 05 , 2026 | 10:16 PM
మన్యంలో ఎండలు మండుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున మాత్రం పొగమంచు కురుస్తుండగా.. తర్వాత నుంచి ఎండ మండిపోతోంది.
ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి
ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్న గిరిజనం
కొయ్యూరులో 39.4 డిగ్రీలు
పాడేరు, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): మన్యంలో ఎండలు మండుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున మాత్రం పొగమంచు కురుస్తుండగా.. తర్వాత నుంచి ఎండ మండిపోతోంది. ఎండ వేడిమిని గిరిజనులు తట్టుకోలేకపోతున్నారు. ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం పూట రోడ్లపైకి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఏజెన్సీలో శుక్రవారం కొయ్యూరులో 39.4 డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా పాడేరు, డుంబ్రిగుడ, జీకేవీధిలో 37.6, అనంతగిరిలో 35.0, చింతపల్లిలో 34.5, జి.మాడుగులలో 33.0, హుకుంపేటలో 31.4, ముంచంగిపుట్టు, పెదబయలులో 31.3, డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.