మండుతున్న ఎండలు
ABN , Publish Date - May 03 , 2026 | 12:36 AM
మన్యంలో ఎండలు మండుతున్నాయి. దీంతో గిరిజనులు అల్లాడుతున్నారు. ఎండల వేడికి ఉక్కపోత తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత విపరీతంగా ఉంది.
గిరిజనులు ఉక్కిరిబిక్కిరి
కొయ్యూరులో 37.1 డిగ్రీలు
పాడేరు, మే 2(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఎండలు మండుతున్నాయి. దీంతో గిరిజనులు అల్లాడుతున్నారు. ఎండల వేడికి ఉక్కపోత తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత విపరీతంగా ఉంది. మధ్యాహ్నం వేళల్లో మరింత అధికం కావడంతో బయట సంచరించేందుకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాహనాల రాకపోకలు సైతం తగ్గుముఖం పడుతుండడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. శనివారం కొయ్యూరులో 37.1 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా పాడేరు, జీకేవీధి, డుంబ్రిగుడలో 36.0, అరకులోయలో 35.6, జి.మాడుగులలో 33.7, చింతపల్లిలో 32.8, పెదబయలులో 32.4, అనంతగిరిలో 32.3, హుకుంపేట, ముంచంగిపుట్టులో 32.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.