Share News

మండే ఎండలు

ABN , Publish Date - Apr 27 , 2026 | 11:47 PM

మన్యంలో ఎండ ఠారెత్తిస్తోంది. సోమవారం ఎండ తీవ్రంగా కాసింది. ఉదయం ఏడున్నర గంటల నుంచే ఎండ ప్రభావం కనిపించింది.

మండే ఎండలు
సోమవారం ఎండకు నిర్మానుష్యంగా ఉన్న పాడేరు- అరకులోయ జాతీయ రహదారి

అరకులోయలో 38.7 డిగ్రీలు

పాడేరు, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): మన్యంలో ఎండ ఠారెత్తిస్తోంది. సోమవారం ఎండ తీవ్రంగా కాసింది. ఉదయం ఏడున్నర గంటల నుంచే ఎండ ప్రభావం కనిపించింది. మధ్యాహ్నం ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. అరకులోయలో 38.7, కొయ్యూరులో 38.5, జి.మాడుగులలో 36.4, అనంతగిరిలో 35.1, చింతపల్లిలో 34.0, ముంచంగిపుట్టులో 33.7 పెదబయలులో 33.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 27 , 2026 | 11:47 PM