Share News

మండుతున్న ఎండలు

ABN , Publish Date - Apr 05 , 2026 | 11:14 PM

మన్యంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా విభిన్నమైన వాతావరణం నెలకొంటోంది. ఉదయం పొగమంచు, తర్వాత ఎండ, సాయంత్రం వేళల్లో వర్షం పడుతున్నది.

మండుతున్న ఎండలు
పాడేరులో ఎండ ధాటికి గొడుగులు వేసుకున్న చిరు వర్తకులు

కొయ్యూరులో 36.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

పాడేరు, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): మన్యంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా విభిన్నమైన వాతావరణం నెలకొంటోంది. ఉదయం పొగమంచు, తర్వాత ఎండ, సాయంత్రం వేళల్లో వర్షం పడుతున్నది. ఆదివారం కొయ్యూరులో 36.6, అరకులోయలో 35.4, చింతపల్లిలో 35.1, అనంతగిరి, జి.మాడుగులలో 33.7, హుకుంపేటలో 31.4, పెదబయలులో 31.1, ముంచంగిపుట్టులో 30.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చింతపల్లిలో...

చింతపల్లి: మండలంలో తేలికపాటి వర్షం కురిసింది. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఒంటి గంట నుంచి వాతావరణంలో మార్పు వచ్చింది. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. రెండు గంటల నుంచి మూడు గంటల వరకు తేలికపాటి వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.

Updated Date - Apr 05 , 2026 | 11:14 PM