మండిన సండే
ABN , Publish Date - Apr 26 , 2026 | 11:18 PM
మన్యంలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఆదివారం ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపాడు. మధ్యాహ్నం జన సంచారం లేక రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి.
అరకులోయలో 38.7 డిగ్రీలు
పాడేరు, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఆదివారం ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపాడు. మధ్యాహ్నం జన సంచారం లేక రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. అరకులోయలో 38.7, కొయ్యూరులో 38.3, పాడేరు, డుంబ్రిగుడ, జీకేవీధిలో 37.2, జి.మాడుగులలో 36.4, అనంతగిరి, చింతపల్లిలో 35.1, ముంచంగిపుట్టులో 33.7, పెదబయలు, హుకుంపేటలో 33.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.