మండిన సూరీడు
ABN , Publish Date - Apr 25 , 2026 | 12:01 AM
మన్యంలో శుక్రవారం ఎండ తీవ్రంగా కాసింది. వాతావరణంలోని మార్పులు చోటుచేసుకుంటున్నప్పటికీ ఎండల తీవ్రత మాత్రం కొనసాగుతోంది.
తీక్షణంగా కాసిన ఎండ
ఏజెన్సీలో పెరిగిన ఉష్ణోగ్రతలు
కొయ్యూరులో 39.3, అరకులోయలో 38.5 డిగ్రీలు
పాడేరు, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): మన్యంలో శుక్రవారం ఎండ తీవ్రంగా కాసింది. వాతావరణంలోని మార్పులు చోటుచేసుకుంటున్నప్పటికీ ఎండల తీవ్రత మాత్రం కొనసాగుతోంది. దీంతో ఏజెన్సీ వాసులు సైతం ఎండలకు విలవిల్లాడుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలై, మధ్యాహ్నానికి తీవ్రమైనప్పటికీ ఆకాశం కాస్త మబ్బులు పట్టడడంతో కొంత ఉపశమనం కలిగింది. మన్యంలో శుక్రవారం కొయ్యూరులో 39.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా అరకులోయలో 38.5, అనంతగిరిలో 37.7, జి.మాడుగులలో 36.8, పెదబయలులో 35.1, హుకుంపేటలో 35.0, ముంచంగిపుట్టులో 34.7 చింతపల్లిలో 33.8, డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.