Share News

మండే సూర్యుడు

ABN , Publish Date - Apr 21 , 2026 | 12:43 AM

మన్యంలో సోమవారం సూర్యుడు ప్రతాపం చూపించాడు. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది.

మండే సూర్యుడు
పాడేరులో ఎండ కారణంగా సోమవారం గొడుగు వేసుకుని వెళుతున్న వృద్ధురాలు

కొయ్యూరులో 38.9 డిగ్రీలు

పాడేరు, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): మన్యంలో సోమవారం సూర్యుడు ప్రతాపం చూపించాడు. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. కొయ్యూరులో 38.9, అరకులోయలో 38.5, జి.మాడుగులలో 38.1, హుకుంపేటలో 35.7, చింతపల్లిలో 35.5, ముంచంగిపుట్టులో 34.5, అనంతగిరిలో 34.3, పెదబయలులో 32.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

కొయ్యూరులో..

కొయ్యూరు: మండలంలో ఎండ ఠారెత్తించింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచే ఎండ మొదలైంది. మధ్యాహ్నం మరింత తీవ్రంగా ఉండడంతో రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయు. వేడి గాలులకు జనం అల్లాడిపోయారు.

Updated Date - Apr 21 , 2026 | 12:43 AM