మండుతున్న ఎండలు
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:32 PM
మన్యంలో ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో రోడ్లు సైతం నిర్మానుష్యం అవుతున్నాయి.
మధ్యాహ్నం వేళలో నిర్మానుష్యమైన రోడ్లు
అల్లాడుతున్న జనం
కొయ్యూరులో 36.5 డిగ్రీలు
పాడేరు, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో రోడ్లు సైతం నిర్మానుష్యం అవుతున్నాయి. గత నాలుగు రోజులుగా వర్షం జాడే లేకపోవడంతో ఎండ వేడిమికి జనం విలవిల్లాడుతున్నారు. కొన్ని రోజులుగా ఉదయం ఆరున్నర గంటల నుంచే ఎండ ప్రభావం మొదలు కావడం, మధ్యాహ్నమైతే మరింత తీవ్రం అవుతోంది. దీంతో రోడ్లపై జనం తిరిగేందుకు సాహసించడం లేదు. ఏజెన్సీలో శుక్రవారం కొయ్యూరులో 36.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా అరకులోయలో 34.8, చింతపల్లి, జి.మాడుగులలో 34.0, అనంతగిరిలో 32.8, హుకుంపేటలో 31.8, పెదబయలులో 31.5, ముంచంగిపుట్టులో 30.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.