అన్ని పాఠశాలలకు భవనాలు
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:28 PM
మనబడి-మన భవిష్యత్తు కార్యక్రమంలో భవనాలు లేని పాఠశాలలు ఉండకూడదనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్టు సమగ్ర శిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ (ఏపీసీ) స్వామినాయుడు అన్నారు.
సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ స్వామినాయుడు
సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా చర్యలు
మరమ్మతులు, మౌలిక సౌకర్యాలపై సమాచారంతో
నివేదికలివ్వాలని ఎంఈవోలకు ఆదేశం
అరకులోయ, ఏప్రిల్ 10 (ఆంద్రజ్యోతి): మనబడి-మన భవిష్యత్తు కార్యక్రమంలో భవనాలు లేని పాఠశాలలు ఉండకూడదనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్టు సమగ్ర శిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ (ఏపీసీ) స్వామినాయుడు అన్నారు. శుక్రవారం మండలంలోని రవ్వలగుడ పాఠశాల కాన్ఫరెన్స్‌హాల్‌లో జరిగిన అరకు, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల ఎంఈవోలు, ఏటీడబ్ల్యూవోలు, సీఆర్‌పీలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్‌తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలాలలోని అన్ని పాఠశాలలపై ఎంఈవోలు నివేదికలు ఇవ్వాలన్నారు. పాఠశాలల్లో భవనాలు, సౌకర్యాలు వంటి అంశాలను నివేదికలో పొందుపరచాలన్నారు. శిథిల భవనాలు, భవనాలు లేని పాఠశాలల్లో ఎలా తరగతులు నిర్వహిస్తున్నది పేర్కొనాలన్నారు. మరమ్మతు చేయాల్సిన భవనాలు, మౌలిక సౌకర్యాలు గురించి సవివరంగా నివేదికను సిద్ధం చేయాలని ఏపీవో స్వామినాయుడు ఆదేశించారు. అలాగే నూతన పాఠశాలల భవన నిర్మాణాలకు నిధులు మంజూరుకు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంఈవోలు వంతల త్రినాథరావు, భారతీరత్నం, కె.బాలాజీ, ఎస్.సుందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.