Share News

గ్రామ స్వరాజ్యంతోనే నవ భారత నిర్మాణం

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:54 PM

గ్రామ స్వరాజ్యంతోనే నవభారత నిర్మాణం సాధ్యమని జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి అన్నారు.

గ్రామ స్వరాజ్యంతోనే నవ భారత నిర్మాణం
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి, పక్కన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తదితరులు

జిల్లా కలెక్టర్‌ నిశాంతి

ఘనంగా జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం

పాడేరు, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): గ్రామ స్వరాజ్యంతోనే నవభారత నిర్మాణం సాధ్యమని జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి అన్నారు. శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా పాడేరులో డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో ఆమె ముఖ్యఅతిఽథిగా మాట్లాడారు. గ్రామ స్వరాజ్యంతోనే వికసిత్‌ భారత్‌- 2047 సాధించవచ్చునని, నిజమైన ప్రజాస్వామ్యం గ్రామాల్లోనే వెల్లివిరుస్తుందన్నారు. గ్రామాల్లోని ప్రజల కనీస అవసరాలు తీర్చడం, మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా సుస్థిర అభివృద్ధికి బాటలు పడతాయన్నారు. వాటిని పంచాయతీరాజ్‌ వ్యవస్థ ద్వారా సాధిస్తున్నామన్నారు. గ్రామాల స్వయం సమృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నదని, దానిని సద్వినియోగం చేసుకుని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సభాధ్యక్షత వహించిన డీఎల్‌పీవో కుమార్‌ రాజ్యాంగ సవరణ, పంచాయతీరాజ్‌ చట్టం, ప్రయోజనాలను వివరించారు. అంతకుముందు మహాత్మగాంధీ చిత్రపటానికి కలెక్టర్‌ నిశాంతి, మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి, తదితరులు పూలమాలులు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖరరావు, ఎంపీడీవో రతన్‌తేజ్‌, డిప్యూటీ ఎంపీడీవోలు ఆర్‌వీఎస్‌వీ.రమేశ్‌, రామకృష్ణ, జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొట్టగుళ్లి సుబ్బారావు, పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి డప్పోడి వెంకటరమణ, డైరెక్టర్లు బుద్ధ జ్యోతికిరణ్‌, అల్లంగి సుబ్బలక్ష్మి, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 11:54 PM