Share News

పంచాయతీ పోరుకు నగారా

ABN , Publish Date - Nov 14 , 2026 | 01:11 AM

గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. మూడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసినటుట కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి విజయకృష్ణన్‌ శుక్రవారం తెలిపారు. జిల్లాలోని 642 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల కోసం 6,335 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

పంచాయతీ పోరుకు నగారా

జిల్లాలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలను విడుదల చేసిన కలెక్టర్‌

తొలి విడత 8 మండలాల్లో 217 పంచాయతీలు

రేపటి నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరణ

21న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల

26న పోలింగ్‌, ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి

అనకాపల్లి/ కలెక్టరేట్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. మూడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసినటుట కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి విజయకృష్ణన్‌ శుక్రవారం తెలిపారు. జిల్లాలోని 642 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల కోసం 6,335 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 12,28,253 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని, వీరిలో పురుషులు 5,98,959 మంది, మహిళలు 6,29,277 మంది, ఇతరులు 17 మంది వున్నారన్నారు. తొలి దశలో ఎనిమిది మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయని, వీటిలో అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అనకాపల్లి, కశింకోట, బుచ్చెయ్యపేట, చోడవరం, పరవాడ, సబ్బవరం మండలాలు, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని రావికమతం, రోలుగుంట మండలాలు వున్నాయని ఆమె వెల్లడించారు. మొదటి విడతలో 217 గ్రామ పంచాయతీల్లో 2,213 పోలింగ్‌ కేంద్రాల్లో 4,56,597 మంది ఓటు హక్కును వినియోగించుకుంటారని పేర్కొన్నారు.

రెండవ విడతలో పాయకరావుపేట, ఎలమంచిలి నియోజకవర్గాల్లో ఎనిమిది మండలాల్లో ఎన్నికలు జరుగుతాయని, వీటి పరిధిలోని 213 పంచాయతీల్లో 2,092 పోలింగ్‌ కేంద్రాల్లో 4,17,399 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. మూడో విడతలో మాడుగుల, నర్సీపట్నం నియోజకవర్గాల్లోని ఎనిమిది మండలాల పరిధిలో 212 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని, మొత్తం 2,030 పోలింగ్‌ కేంద్రాల్లో 3,54,257 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆమె వెల్లడించారు.

మొదటి దశకు రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

మొదటి విడత పోలింగ్‌ జరగనున్న పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు పదవులకు ఈనెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎంపికచేసిన కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. 18వ తేదీన నామినేషన్ల పరిశీలన, 19వ తేదీన తిరస్కరించిన నామినేషన్లపై అప్పీళ్ల స్వీకరణ, 20వ తేదీన అప్పీళ్ల పరిష్కారం చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 21వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు వుంది. అనంతరం పోటీలో వున్న అభ్యర్థుల తుది జాబితాలను ప్రకటిస్తారు. ఇదే సమయంలో ఏకగ్రీవం అయిన సర్పంచ్‌, వార్డులను కూడా వెల్లడిస్తారు. తరువాత 26వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. సర్పంచ్‌ ఎన్నిక పార్టీ రహితంగా ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తారు.

మండలం పంచాయతీలు

అనకాపల్లి 32

కశింకోట 27

పరవాడ 15

సబ్బవరం 24

చోడవరం 32

బుచ్చెయ్యపేట 35

రోలుగుంట 24

రావికమతం 28

మొత్తం 217

Updated Date - Nov 14 , 2026 | 01:11 AM