వెలపాలెంలో దారుణ హత్య
ABN , Publish Date - May 20 , 2026 | 12:21 AM
మద్యానికి బానిసైన ఒక వ్యక్తి పింఛన్ సొమ్ము కోసం తండ్రిని దారుణంగా హత్య చేసిన సంఘటన సోమవారం రాత్రి మండలంలోని వెలపాలెం గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించి పెదబయలు ఎస్‌ఐ వెంకటేశ్ మంగళవారం తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని సీకరి పంచాయతీ వెలపాలెం గ్రామానికి చెందిన లకే సింహాచలం(55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
- పింఛన్ సొమ్ము కోసం తండ్రిని హతమార్చిన కుమారుడు
- పరారీలో నిందితుడు
పెదబయలు, మే 19 (ఆంధ్రజ్యోతి): మద్యానికి బానిసైన ఒక వ్యక్తి పింఛన్ సొమ్ము కోసం తండ్రిని దారుణంగా హత్య చేసిన సంఘటన సోమవారం రాత్రి మండలంలోని వెలపాలెం గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించి పెదబయలు ఎస్‌ఐ వెంకటేశ్ మంగళవారం తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని సీకరి పంచాయతీ వెలపాలెం గ్రామానికి చెందిన లకే సింహాచలం(55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు రమేశ్ ఉన్నారు. అయితే రమేశ్ మద్యానికి బానిసై 2021 జనవరిలో తన భార్యను హత్య చేసిన కేసులో ఐదేళ్లు జైలుశిక్ష అనుభవించి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. అతని ఇద్దరు పిల్లలను తండ్రే సంరక్షిస్తున్నాడు. కాగా కొంత కాలంగా తండ్రికి వస్తున్న ప్రభుత్వ పింఛన్ సొమ్ము తనకు ఇవ్వాలని రమేశ్ తరచూ గొడవ పడుతున్నాడు. సోమవారం రాత్రి కూడా దీనిపై గొడవ పడడంతో ఇవ్వనని అతని తండ్రి సింహాచలం చెప్పాడు. దీంతో రమేశ్ కోపోద్రిక్తుడై కర్రతో తండ్రి తలపై విచక్షణారహితంగా కొట్టి చంపి పరారయ్యాడు. స్థానిక సర్పంచ్ కృష్ణారావు ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.