Share News

గాజువాకలో దారుణ హత్య

ABN , Publish Date - Mar 30 , 2026 | 01:35 AM

డబ్బు కోసం వేధిస్తోందనే కారణంతో ప్రియురాలిని దారుణంగా హత మార్చడంతో పాటు మృతదేహాన్ని రెండు భాగాలుగా కోసేసిన కిరాతక సంఘటన గాజువాక ఎల్‌వీనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగింది.

గాజువాకలో దారుణ హత్య

గాజువాక, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):

డబ్బు కోసం వేధిస్తోందనే కారణంతో ప్రియురాలిని దారుణంగా హత మార్చడంతో పాటు మృతదేహాన్ని రెండు భాగాలుగా కోసేసిన కిరాతక సంఘటన గాజువాక ఎల్‌వీనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి...

ఇండియన్‌ నేవీలో ఎయిర్‌ క్రాప్ట్‌ టెక్నిషీయన్‌గా పనిచేస్తున్న రవీంద్రకు కైలాసపురం ప్రాంతానికి చెందిన వివాహితరాలు మౌనిక (28)తో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆదివారం ప్రియురాలు మౌనికను తన ఇంటికి రమ్మని పిలిచాడు. రాత్రి వరకు ఇద్దరూ సఖ్యతగానే ఉన్నట్టు సమాచారం. అయితే అర్ధరాత్రి దాటిన తరువాత వారిద్దరి మధ్య చిన్న పాటి వాగ్వాదం జరిగిందని, క్రమేణా అది పెద్దది కావడంతో కోపోద్రిక్తుడైన రవీంద్ర ఇంట్లో ఉన్న కత్తిలో మౌనికను పొడిచి చంపేశాడు. అంతేకాకుండా మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి, సగ భాగాన్ని ఫ్రిజ్‌లో పెట్టేశాడు. మరో భాగాన్ని మూటకట్టి ఇంట్లోనే ఓ మూలన ఉంచాడు. అనంతరం నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి తాను చేసిన నేరాన్ని వివరించి, లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు రవీంద్రను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా, తనను మౌనిక డబ్బుకోసం తీవ్రంగా వేధిస్తోందని, తట్టుకోలేక హతమార్చానని అంగీకరించినట్టు సమాచారం. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 30 , 2026 | 01:35 AM