Share News

పీడీ యాక్టుపై అన్నదమ్ముల అరెస్టు

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:10 PM

గంజాయి రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడుతున్న అన్నదమ్ములను పీడీ యాక్టుపై అరెస్టు చేసి జైలుకు తరలించినట్టు కొయ్యూరు సీఐ బి.శ్రీనివాసరావు తెలిపారు.

పీడీ యాక్టుపై అన్నదమ్ముల అరెస్టు

కొయ్యూరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడుతున్న అన్నదమ్ములను పీడీ యాక్టుపై అరెస్టు చేసి జైలుకు తరలించినట్టు కొయ్యూరు సీఐ బి.శ్రీనివాసరావు తెలిపారు. సీఐ అందించిన వివరాలిలా ఉన్నాయి.

మండలంలో మర్రివాడ పంచాయతీ దొడ్డవరం గ్రామానికి చెందిన మాగాపు చక్రవర్తి(చక్రి), మాగాపు గంగాధర్‌ గంజాయి రవాణా, విక్రయాలకు తరచూ పాల్పడుతున్నారు. వీరిపై పలు కేసులు నమోదయ్యాయి. యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా చేస్తుండడంతో వీరిపై పీడీ యాక్టు కింద ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. వారు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు శనివారం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించినట్టు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గంజాయి కొనుగోలు, రవాణా, నిల్వ చేయడం, విక్రయించడం వంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎటువంటి ఉపేక్షించమన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ ఎస్‌.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 11:10 PM