Share News

జోరుగా వినాయక ప్రతిమల విక్రయాలు

ABN , Publish Date - Sep 06 , 2026 | 11:26 PM

వినాయక ప్రతిమల విక్రయాలు పాడేరు మార్కెట్‌లో జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 14న వినాయక చవితి సందర్భంగా ఎక్కడికక్కడ చవితి పందిర్లు వెలుస్తున్నాయి.

జోరుగా వినాయక ప్రతిమల విక్రయాలు
వినాయక ప్రతిమల కొనుగోలుదారులతో రద్దీగా ఉన్న పాడేరు మార్కెట్‌

కొనుగోలుదారులతో పాడేరు మార్కెట్‌ రద్దీ

పాడేరురూరల్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): వినాయక ప్రతిమల విక్రయాలు పాడేరు మార్కెట్‌లో జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 14న వినాయక చవితి సందర్భంగా ఎక్కడికక్కడ చవితి పందిర్లు వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైదాన ప్రాంతాల నుంచి వ్యాపారులు వినాయక ప్రతిమలను తీసుకు వచ్చి పాడేరులో విక్రయిస్తున్నారు. భారీ ప్రతిమలు అయితే ముందుగా ఆర్డరు తీసుకుని చేయించి తీసుకువస్తున్నారు. ఈ ఏడాది ప్రతిమల సైజును బట్టి రూ.2 వేలు నుంచి రూ.18 వేలు వరకు విక్రయిస్తున్నారు. మూడు అడుగుల ప్రతిమ రూ.3,500 నుంచి రూ. 4,000, నాలుగు అడుగులదైతే రూ.5,000 నుంచి రూ.5,500, ఐదు అడుగులదైతే రూ.7,500 నుంచి రూ.8,000, ఎనిమిది అడుగులదైతే రూ.10,500 నుంచి రూ. 12,500, పది అడుగులదైతే రూ.16,000 నుంచి రూ.18,000 వరకు మోడల్‌ను బట్టి అమ్మకాలు చేపడుతున్నారు. ఆదివారం ఒడిశా వాసులకు ఆరు భారీ ప్రతిమలను విక్రయించినట్టు వ్యాపారులు తెలిపారు. అలాగే జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఉత్సవ నిర్వాహకులు వచ్చి ప్రతిమలను కొనుగోలు చేశారు.

Updated Date - Sep 06 , 2026 | 11:26 PM