గ్రామాల్లో ఇటుకల పండుగ సందడి
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:06 PM
మండలంలోని గిరిజన గ్రామాల్లో ఇటుకల పండుగ సందడి మొదలైంది. ఆదివారం జంగంసరియా, మజ్జిగూడ, బోడిపుట్టు, తదితర గ్రామాల్లో ఇటుకల పండుగ సందర్భంగా పెద్ద వేట ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ముంచంగిపుట్టు, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గిరిజన గ్రామాల్లో ఇటుకల పండుగ సందడి మొదలైంది. ఆదివారం జంగంసరియా, మజ్జిగూడ, బోడిపుట్టు, తదితర గ్రామాల్లో ఇటుకల పండుగ సందర్భంగా పెద్ద వేట ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటూ గ్రామస్థులు శంకుదేవుడు(గ్రామ దేవత)ను వేడుకున్నారు. ఈ పండుగను పది రోజుల పాటు నిర్వహిస్తారు.