మత్స్యగెడ్డలో మునిగి బాలుడి మృతి
ABN , Publish Date - May 01 , 2026 | 12:15 AM
మండలంలోని దారెల పంచాయతీ పేటమాలిపుట్టు సమీపంలో గల మత్య్సగెడ్డలో గురువారం బాలుడు మృతి చెందాడు.
ముంచంగిపుట్టు, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దారెల పంచాయతీ పేటమాలిపుట్టు సమీపంలో గల మత్య్సగెడ్డలో గురువారం బాలుడు మృతి చెందాడు. పేటమాలిపుట్టు గ్రామానికి చెందిన వి.లక్ష్మణ్ (14), తన ముగ్గురు స్నేహితులతో కలిసి మత్య్సగెడ్డలోని స్నానానికి దిగాడు. కొంతసేపు సరదాగా గడిపారు. తర్వాత లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోని వెళ్లిన లక్ష్మణ్ మునిగిపోయాడు. ఇది గమనించిన స్నేహితులు కేకలు వేయగా.. పేటమాలిపుట్టు గ్రామస్థులు నాటు పడవలో గాలింపు చర్యలు చేపట్టారు. రెండు గంటల తరువాత బాలుడు మృతదేహం లభ్యమైంది. ఘటన స్థలానికి తహశీల్దార్ భాస్కర అప్పారావు, ఎస్‌ఐ నాని చేరుకున్నారు. లక్ష్మణ్ మృతదేహం వద్ద తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబాన్ని టీడీపీ డివిజన్ నేత, దారెల మాజీ సర్పంచ్ పాండురంగస్వామి పరామర్శించి, ఓదార్చారు.