ఎట్టకేలకు బొండాం కొత్తవలస రోడ్డు పూర్తి
ABN , Publish Date - Oct 14 , 2026 | 12:34 AM
ఎట్టకేలకు బొండాం కొత్తవలస గ్రామానికి రహదారి నిర్మాణం పూర్తయింది. గత టీడీపీ ప్రభుత్వంలో ఈ రహదారితో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. అయితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ బిల్లులు విడుదల చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి.
- గ్రామస్థుల ఆనందం
అరకులోయ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు బొండాం కొత్తవలస గ్రామానికి రహదారి నిర్మాణం పూర్తయింది. గత టీడీపీ ప్రభుత్వంలో ఈ రహదారితో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. అయితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ బిల్లులు విడుదల చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ పనులకు కదలిక వచ్చింది. ఎట్టకేలకు బొండాం కొత్తవలస నుంచి పెద్దగెడ్డ వంతెన వరకు తారు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. టీడబ్ల్యూ డీఈఈ అభిషేక్ పర్యవేక్షణలో ఈ పనులు పూర్తయ్యాయి. రహదారి నిర్మాణం పూర్తి కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.