Share News

జిల్లా కోర్టులో బాంబు కలకలం

ABN , Publish Date - Feb 26 , 2026 | 01:21 AM

జిల్లా కోర్టులో బుధవారం బాంబు కలకలం రేపింది. కోర్టులో బాంబు పెట్టినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మెయిల్‌కు గురువారం గుర్తుతెలియని వ్యక్తి నుంచి సమాచారం వచ్చింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు వెంటనే స్పందించి నగర పోలీస్‌ కమిషనర్‌కు విషయం తెలియజేశారు.

జిల్లా కోర్టులో బాంబు కలకలం
జిల్లా కోర్టు ఆవరణలో పోలీసుల తనికీలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి):

జిల్లా కోర్టులో బుధవారం బాంబు కలకలం రేపింది. కోర్టులో బాంబు పెట్టినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మెయిల్‌కు గురువారం గుర్తుతెలియని వ్యక్తి నుంచి సమాచారం వచ్చింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు వెంటనే స్పందించి నగర పోలీస్‌ కమిషనర్‌కు విషయం తెలియజేశారు. ఈ నేపథ్యంలో బాంబు స్క్వాడ్‌ జిల్లా కోర్టుకు చేరుకుని మొత్తం తనిఖీ చేసింది. ఎక్కడా బాంబు లేదని నిర్ధారించింది. దీంతో న్యాయవాదులు, న్యాయమూర్తులు, కక్షిదారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలు వెలికి తీయాలని నగర పోలీస్‌ కమిషనర్‌కు జిల్లా జడ్జి లేఖ రాశారు.

Updated Date - Feb 26 , 2026 | 01:21 AM