బీఎల్‌వో శిరిషకు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు
ABN , Publish Date - Jan 21 , 2026 | 11:10 PM
ఎన్నికల విధుల్లో అంకితభావంతో పనిచేసిన హుకుంపేట మండలం సంతారిలోని 113వ పోలింగ్ కేంద్రం బీఎల్‌వో వంపూరు శిరీష రాష్ట్ర స్థాయి ఉత్తమ ఎన్నికల ప్లెజ్డెస్ అవార్డుకు ఎంపికయ్యారు.
ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి
అరకులోయ, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధుల్లో అంకితభావంతో పనిచేసిన హుకుంపేట మండలం సంతారిలోని 113వ పోలింగ్ కేంద్రం బీఎల్‌వో వంపూరు శిరీష రాష్ట్ర స్థాయి ఉత్తమ ఎన్నికల ప్లెజ్డెస్ అవార్డుకు ఎంపికయ్యారు. గత ఏడాదికి సంబంధించి ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రకటించారు. ఓటర్ల జాబితా సవరణ, ఓటర్ల నమోదు, ఇతర ఎన్నికల విధుల్లో ఆమె చూపిన చొరవను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 11.30 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. శిరీష ఉత్తమ అవార్డుకు ఎంపిక కావడం పట్ల అరకులోయ తహశీల్దార్, ఏఈఆర్‌వో హర్షం వ్యక్తం చేశారు. సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఆమెకు అవార్డు రావడంపై రెవెన్యూ సిబ్బంది, బీఎల్‌వోలు ఆనందం వ్యక్తం చేశారు.