Share News

మాకవరపాలెంలో ‘బ్లాక్‌ స్టోన్‌’ కంపెనీ

ABN , Publish Date - May 21 , 2026 | 01:06 AM

మండలంలో ఇటీవల రెవెన్యూ అధికారులు గుర్తించిన 4,250 ఎకరాల ల్యాండ్‌ బ్యాంకు భూములను బుధవారం ఏపీఐఐసీ అధికారుల ఆధ్వర్యంలో ఒక ప్రైవేటు కంపెనీ ప్రతినిధులు పరిశీలించారు. మూడు నెలల కిందట పైడిపాల, పాపయ్యపాలెం, పెద్దిపాలెం, బూరుగుపాలెం గ్రామాల్లో 4,250 ఎకరాల డి.పట్టా భూములతోపాటు ప్రభుత్వ భూములను ల్యాండ్‌ బ్యాంకు కింద అధికారులు గుర్తించారు. అయితే ఆయా రైతులతో ఇంతవరకు సమావేశాలు నిర్వహించలేదు.

మాకవరపాలెంలో ‘బ్లాక్‌ స్టోన్‌’ కంపెనీ
పైడిపాల వద్ద ల్యాండ్‌ బ్యాంకు భూముల మ్యాప్‌ను పరిశీలిస్తున్న అధికారులు, ప్రైవేటు కంపెనీ ప్రతినిధులు

ల్యాండ్‌ బ్యాంకు భూములను పరిశీలించిన ప్రతినిధులు

450 ఎకరాలు అవసరమని అధికారులు వెల్లడి

మాకవరపాలెం, మే 20 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఇటీవల రెవెన్యూ అధికారులు గుర్తించిన 4,250 ఎకరాల ల్యాండ్‌ బ్యాంకు భూములను బుధవారం ఏపీఐఐసీ అధికారుల ఆధ్వర్యంలో ఒక ప్రైవేటు కంపెనీ ప్రతినిధులు పరిశీలించారు. మూడు నెలల కిందట పైడిపాల, పాపయ్యపాలెం, పెద్దిపాలెం, బూరుగుపాలెం గ్రామాల్లో 4,250 ఎకరాల డి.పట్టా భూములతోపాటు ప్రభుత్వ భూములను ల్యాండ్‌ బ్యాంకు కింద అధికారులు గుర్తించారు. అయితే ఆయా రైతులతో ఇంతవరకు సమావేశాలు నిర్వహించలేదు. ఈ నేపఽథ్యంలో బుధవారం ఒక ప్రైవేటు కంపెనీ ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు ఇక్కడకు వచ్చి భూములను పరిశీలించడంతో రైతుల్లో కలకలం మొదలైంది. అయితే ఈ నాలుగు గ్రామాల్లో భూములను ప్రభుత్వం తీసుకోవడం ఖాయమని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇందులో 450 ఎకరాలను బ్లాక్‌ స్టోన్‌ ఇంక్‌ అనే కంపెనీ తీసుకుంటున్నట్టు ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ నరసింహహారావు తెలిపారు. భూములను పరిశీలించిన వారిలో తహశీల్దారు లోకవరపు రామారావు, డీటీ రాజ్‌భరత్‌, మండల సర్వేయరు వెంకటేశ్వరరావు తదితరులు వున్నారు.

Updated Date - May 21 , 2026 | 01:06 AM